Revanth reddy targets modi over manipur issue: గిరిజనులపై ప్రధాని మోదీకి చులకన భావం ఉందంటూ విమర్శలు గుప్పించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్సభ వేదికగా ఈ కామెంట్స్ చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ ఈ సభలోకి వస్తే గౌరవం ఉండేదన్నారు. ఇవాళ మోదీ సభకు రాకపోవడాన్ని ప్రస్తావించిన రేవంత్రెడ్డి.. మణిపూర్లో జరుగుతున్న మారణకాండకు ఆదివాసీలకు క్షమాపణ చెప్పి ఉంటే వారి గౌరవం మరింత పెరిగి ఉండేదన్నారు. తొమ్మిదేళ్లుగా మోదీ నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు రేవంత్. అందుకే ఈరోజు ప్రధాని సభలోకి రాలేదని.. ఆయనకు గిరిజనుల పట్ల ఏ మాత్రం గౌరవించలేదని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..‘బ్రిటీష్ జనతా పార్టీ’.. హోంమంత్రికి బాధ్యత లేదా? లోక్సభలో రేవంత్ ఫైర్
ప్రపంచంలోనే అత్యధిక అబద్దాలు ఉన్న పుస్తకాలు బీజేపీ మేనిఫెస్టోలంటూ బీజేపీ టార్గెట్గా వ్యంగ్యస్త్రాలు సంధించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా మోదీపై మండిపడ్డారు. మణిపూర్ మండుతుంటే మోదీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతీ ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు.

Translate this News:











