కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఎల్బీ నగర్లో పర్యటించిన ఆయన రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో స్థానిక బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మలా మారారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన సాగిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అయుష్మాన్ భారత్ స్కీమ్‌ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో నడుస్తోన్న కుటుంబ పాలన, దుష్టపాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా పని చేస్తోందని తరుణ్ చుగ్ విమర్శించారు.
పూర్తిగా చదవండి..ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్.. బీఆర్ఎస్ తరుణ్ చుగ్ ఫైర్
తెలంగాణ బీజేపీ వ్యవహాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఎల్బీ నగర్లో పర్యటించారు. అక్కడ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన.. తాజా రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మలా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











