తెలంగాణలో గుంతల రోడ్ల పరిస్థితిపై మూడు వారాల్లో రిపోర్టివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ బాచుపల్లిలో గుంతల రోడ్డు కారణంగా ఓ చిన్నారి యాక్సిడెంట్ కు గురై మృతి చెందిన ఘటనను సుమోటాగా తీసుకున్న హైకోర్టు చీఫ్ జస్టీస్ అలోక్ ఆరాధే , జస్టీస్ టీ .వినోద్ కుమార్ డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది . దీనిపై తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై మూడు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది . దీంతో పాటు నిజాంపేట మున్సిపాలిటీని ప్రతివాదుల లిస్టులో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..తెలంగాణాలో అధ్వాన్న రోడ్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
తెలంగాణలో రోడ్ల పరిస్థితిపై మూడు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ బాచుపల్లిలో గుంతల రోడ్డు కారణంగా ఓ చిన్నారి యాక్సిడెంట్ కు గురై మృతి చెందిన ఘటనను సుమోటాగా తీసుకున్న హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 2న హైదరాబాద్ బాచుపల్లిలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది .

Translate this News:











