బంగారం తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరులో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వారి ఆరోపణలపై స్పందించిన శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు రాజకీయంగా ఓడించలేక తన మరణాన్ని కోరుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను భౌతికంగా ఉంటే టీడీపీ నేతలు గెలవలే.. రాజకీయంగా ఎలాంటి పదవులు పొందలేరన్నారు. పోలీసులు, ఇంటెలిజెన్స్, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
పూర్తిగా చదవండి..నా చావు కోరుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Translate this News:











