ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అభివృద్ధి చేయకుండా ఇండస్ట్రీపై ఎందుకు పడతారని ఏపీ ప్రభుత్వాన్ని చిరు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పేదల కోసం ఆలోచిస్తే తలవంచి నమస్కరిస్తా అంటూ చిరంజీవి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాపై పడతారెందుకు అంటూ వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్లో చిరు వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాఫిక్‌గా మారింది.
పూర్తిగా చదవండి..పకోడీగాళ్ల సలహాలు మాకొద్దు.. చిరు వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్
ఓ ప్రైవేట్ పార్టీలో చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారింది. ఎప్పుడూ ఏపీ ప్రభుత్వాన్ని కానీ, సీఎం జగన్‌ని కానీ విమర్శించని చిరు ఈ సారి నేరుగా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఏపీ పెద్దలు వరసగా కౌంటర్ ఇస్తున్నారు. జనసేనని సపోర్ట్ చేస్తూ చిరంజీవి ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పనితీరుపై వ్యాఖ్యలు చేశారాని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Translate this News:











