Rahul To Deliver his Speech on No Confidence Motion : 3 నెలలకు పైగా మణిపూర్ తగలబడిపోతోంది. మహిళల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు కొందరు దుండగులు. ఆ అరాచకంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. మరోవైపు మణిపూర్ (Manipur) హింసపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు విపక్ష కూటమి ఇండియా సభ్యులు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అవిశ్వాస తీర్మానమిచ్చారు. దీనిపై కాసేపట్లో చర్చ జరగనుంది.అధికార NDA, విపక్ష INDIA కూటముల మధ్య లోక్‌సభలో వాడివేడి మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..అవిశ్వాసతీర్మానంపై లోక్ సభలో కీలక చర్చ
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. నిజానికి ఎన్డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాదని, ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ హింసపై మాట్లాడతారని INDIA కూటమి చెబుతోంది

Translate this News:











