Chiranjeevi hot comments on YCP Minister Ambati Rambabu: పరోక్షంగా మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు చురకలంటించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). వాల్తేరు వీరయ్య(Waltair veerayya) 200 డేస్ ఫంక్షన్లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడాలంటూ కౌంటర్లు వేశారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని.. పేదల కడుపునింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పించడంపై దృష్టి పెట్టాలంటూ పరోక్షంగా మంత్రి అంబటికి సెటైర్లు వేశారు. ఇలా చేస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని.. అసలు విషయాలు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ ఇండస్ట్రీపై పడతారేంటంటూ ప్రశ్నించారు చిరు. ఇదేదో పెద్ద సమస్యల చూపించొద్దని. ‘బ్రో'(Bro) సినిమాపై అంబటి వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్లు విసిరారు మెగాస్టార్.
పూర్తిగా చదవండి..మంత్రి అంబటికి ఇచ్చిపడేసిన చిరు.. మెగాస్టార్ ఏమన్నారంటే..?
మంత్రి అంబటి రాంబాబుకు మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా కౌంటర్లు వేశారు. పేదల కడుపునింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నేతలు దృష్టి పెట్టాలని.. అంతేకాని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సినీ ఇండస్ట్రీ గురించి ఎందుకంటూ ప్రశ్నించారు. ఇటివలి 'బ్రో' సినిమా గురించి అంబటి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపాయి. పవన్ రెమ్యూనరేషన్ చెప్పాలంటూ అంబటి అడగడం.. 'బ్రో' సినిమా పెట్టుబడులపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం లాంటి పరిణామాల తర్వాత చిరు వ్యాఖ్యలు పవన్‌కు మద్దతుగా నిలుస్తుండడం మెగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది.

Translate this News:











