మెగాస్టార్ అభిమానులకు పునకాలే. చిరు హీరోగా నటించిన తాజా చిత్ర భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో జరుగుతోంది. ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు మెహర్ రమేశ్ చాలా కాలం తరువాత దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ మూవీకి మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
పూర్తిగా చదవండి..మెగా మాస్ డే.. ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ ఈరోజు. చిరు హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో జరుగుతోంది. ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

Translate this News:











