చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 30 మంది తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేయగా.. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. వారిపై ఐపీసీ 147, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు పోలీసులు.
పూర్తిగా చదవండి..పుంగనూరు ఘటనలో 30మందిపై కేసులు.. విచారణకు డీజీపీ ఆదేశాలు
ఈ ఘటనపై విచారణ చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ లను ఆదేశించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశ పూర్వకంగా తగల పెట్టారన్నారు. ఈ ఘటనలో రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అందరిపై కఠినమైన శిక్షలు అమలు చేస్తామని వెల్లడించారు డీజీపీ. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే అనేకమందిని గుర్తించామని, మరికొందరి కదలికలపై కూడా నిఘా..

Translate this News:











