Heavy rain lashed Machilipatnam, inundating the famous Sai Baba temple junction. People jumped into knee-deep water after they found milk packets floating on it. #AndhraPradesh pic.twitter.com/SCjfWROGFi
పూర్తిగా చదవండి..
వరదలో కొట్టుకొచ్చిన పాలప్యాకెట్లు, ఎగబడిన జనం..
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద వచ్చి చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకురావడంతో మొదటగా ఆశ్చర్యపోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.

Translate this News:











