ఉత్తర భారతదేశంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా గురువారం పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్, ఉత్తరాఖండ్ , ఉత్తరాఖండ్, బీహార్, ఢిల్లీకి IMD వర్ష హెచ్చరిక జారీ చేసింది . అదే సమయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది.
పూర్తిగా చదవండి..పొంగిపొర్లుతున్న యమునా నది…ప్రమాద హెచ్చరికలు జారీ..!!
యమునానది పొంగిపొర్లుతోంది. నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకోవడం తీవ్ర వరద హెచ్చరికలు జారీ చేశారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీని వరద భయం పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలోనే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హథిని కుండ్ బ్యారేజీ నుంచి నీటిని నిరంతరం విడుదల చేస్తున్నారు. యమునాలో నీటిమట్టం పెరగడం వల్ల ITO నిగమ్, బోద్ ఘాట్ సివిల్ లైన్స్, ఢిల్లీలోని జైత్పూర్తో సహా అనేక ప్రాంతాల్లోకి నీరు చేరింది.

Translate this News:












