వ్యభిచార కూపంలోకి నెడతారు.. వెట్టిచాకిరి చేయించుకుంటారు.. బానిసలుగా చూస్తారు.. రోడ్డుపై భిక్షం ఎత్తుకునేలా చేస్తారు.. ఇలా ఒకటేమిటి మానవ అక్రమ రవాణ బాధితుల బాధలు వర్ణణాతీతం..! ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రధాన సమస్య హ్యుమన్ ట్రాఫికింగ్. సైన్సు ఎంతో అభివృద్ధి చెందిన కాలంలో.. మార్స్‌పై మానవుడు అడుగులు మోపేందుకు ప్రయోగాలు జరుగుతున్న సమయంలోనూ మానవ అక్రమ రవాణా కొరలు చాచుతూనే ఉంది. ఈ సమస్య మూలాలను గుర్తించి దాన్ని రూపుమాపాల్సిన ప్రభుత్వాలు ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తుంటాయి. అధికారంలో ఎవరున్నా అంతే.. ఇది మన దేశంలోనే కాదు.. చాలా దేశాల్లోనూ ఇంతే..! అసలు మానవ అక్రమ రవాణాకి ప్రధాన కారణాలేంటి..?
పూర్తిగా చదవండి..Human Trafficking: అంగట్లో అమ్మకాలు.. మానవ అక్రమ రవాణా.. కారణాలివే!
మానవ అక్రమ రవాణాకు ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయని 'హ్యుమన్ రైట్స్ కెరీర్స్' చెబుతోంది. పేదరికం, విద్య లేకపోవడం, చౌకగా కార్మికులను రిక్రూట్ చేసుకునే ముఠాలు పెరగడం, డిమాండ్ ఫర్ సెక్స్, సాంస్కృతిక అంశాలను ఈ లిస్ట్‌లో పెట్టింది.

Translate this News:
















