హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సోలన్‌లోని బద్ది నలగర్ పారిశ్రామిక ప్రాంతంలో వంతెన మొత్తం కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దాదాపు 14మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. వరదల కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
పూర్తిగా చదవండి..హిమాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం..ఆ రికార్డ్ బ్రేక్…!!
భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను ముంచేత్తుతున్నాయి. భారీ వరదల కారణంగా భాక్రా నంగల్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో మండి జిల్లాలో బియాస్ నదిపై కొండిచరియలు విరిగిపడ్డాయి. వరద ధాటికి వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సామాన్య ప్రజానీకానికి తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా 14మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు విజ్నప్తి చేశారు.

Translate this News:












