కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స
కరీంనగర్ జిల్లాలోని అపోలో రీచ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. సాయిశ్రీ అనే 14 ఏళ్ల బాలికకు మెదడులో రక్తం గడ్డ కట్టగా ఫిలిప్స్ అజ్యూరియస్ క్యాతలాబ్ సాయంతో అపోలో రీచ్ ఆసుపత్రి వైద్య బృందం చికిత్సను అందించి సక్సెస్ సాధించారు. సెరబ్రల్ ఆంజియోగ్రఫీ, మెకానికల్ త్రంబెక్టమీ అనే ప్రత్యేక పద్ధతిలో ఈ సర్జరీ చేసినట్లు వైద్యబృందం తెలిపింది.












