మహిళలకు ఇదొక అద్భుతమైన అవకాశం మంత్రి హరీష్రావు ధీమా..!
సిద్దిపేట జిల్లా పాలమాకులలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ తరగతులను రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ మహిళలకు అద్భుతమైన అవకాశమని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో 20 నుంచి 30 మంది మహిళలను గుర్తించి కుట్టు మిషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలమాకుల గ్రామంతో మొదలుపెట్టి నియోజకవర్గ పరిధిలోని 5 వేల మంది మహిళలకు కుట్టు మిషన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.












