కేపీ చౌదరి కేసులో సినీ ప్రముఖులపై ఆరా
తెలుగు సినీ పరిశ్రమలో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కబాలీ మూవీ నిర్మాత కేపీ చౌదరి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. రిమాండ్ రిపోర్టులో 14 మంది పేర్లను పోలీసులు పేర్కొన్నారు. వాళ్ల గురించి ఆరా తీస్తున్నారు. కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు గుర్తించిన పోలీసులు.. దానికి తగిన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.












