హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జీడిమెట్ల, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.












