విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం బారులుదీరారు. దుర్గాదేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది.
పూర్తిగా చదవండి..Indrakiladri: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు..పోటెత్తిన భక్తజనం
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటికి 8వ రోజుకు చేరాయి. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.
Translate this News:











