భారతీయుల ఐడెంటిటీ అని చెబుతున్న ఆధార్ వివరాలు లీక్ అయ్యాయని తెలిపింది అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రిసెక్యురిటీ. మొత్తం 81.5 కోట్లమంది ఇండియన్స్ ఆధార్ వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో పేర్లు, వయసు, ఆధార్ నంబర్, పాస్ పోర్ట్ వివరాలు, మొబైల్ నెంబర్స్ లాంటివి ఉన్నాయి. అక్టోబర్ 9న pwn0001 పేరు కలిగిన హ్యాకర్ భారతీయుల ఆధార్, పాస్ పోర్ట్ రికార్డ్స్ పొందినట్లు రిసెక్యూరిటీ సంస్థ తెలిపింది. పైగా దీన్ని 80వేల డాలర్లకు అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు హ్యాకర్. ఇతను హ్యాక్ చేసిన వివరాలు అన్నీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ దగ్గర ఉన్న భారతీయులకు సంబంధించినవి అని తెలుస్తోంది. దీని మీద సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
పూర్తిగా చదవండి..Aadhar Data haked:అమ్మకానికి 81.5 కోట్ల ఇండియన్ ఆధార్ వివరాలు..డేటా హ్యాక్
టెక్నాలజీ పెరుగుతోంది....దాంతో పాటూ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఆ నేరాల్లో కూడా హద్దులు మీరిపోతున్నారు. మొన్నటివరకూ ప్రభుత్వ వెబ్ సైట్లను, ఇతర విషయాలను హ్యాక్ చేశారు. ఇప్పుడు మాత్రం ఏకంగా భారతీయుల ఆధార్ వివరాలే హ్యాక్ చేసిపడేశారు. అది కూడా 81.5 కోట్ల ఇండియన్స్ వివరాలు డార్క వెబ్ లో లీక్ అయిపోయాయి.

Translate this News:











