తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా చిన్నారుల కిడ్నాప్ ఎక్కువ అయ్యాయి. అయితే, నిన్న తిరుపతి బస్టాండ్లో బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని ఫ్లాట్ ఫారం 3 దగ్గర రెండేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకుపోయాడు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం కోసం తిరుపతి బస్టాండ్లోని చెన్నై ఫ్లాట్ ఫామ్ దగ్గర ఈ ఘటన జరిగింది. పోలీసులు ఎంతో చాకచక్యంతో 7 గంటల్లోనే బాబుని తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. అంతా హాయిగా ఉంది అనుకునే లోపే మరో ఘటన కలకలం రేపింది.
పూర్తిగా చదవండి..Guntur Govt Hospital: గుంటూరులో 8 రోజుల పసిపాప క్షేమం.. అసలేం జరిగిందంటే?
గుంటూరులో ఆస్పత్రిలో ఓ శిశువు అపహరణకు గురైందన చిన్నారి ఆచూకీ లభ్యం అయింది. నరసరావుపేట ఉప్పలపాడు వద్ద చిన్నారి ఉన్నట్లు గుర్తించిన కొత్తపేట పోలీసులు. చిన్నారితోపాటు కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారిని తల్లి రోషిణికి క్షేమంగా అప్పగించారు.

Translate this News:











