Foods To avoid in morning: అల్పాహారం(Breakfast) రోజులో అతి ముఖ్యమైన ఫుడ్. ఇది మనలో చాలా మందికి కచ్చితంగా వర్తిస్తుంది. చాలా మంది టిఫిన్ చేస్తారు కానీ వారికి తగినంత పోషకాలు లభించవు.. అందుకే తినిన తర్వాత కాసేపటికే ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది. అనారోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన టిఫిన్‌లో ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మీకు శక్తిని అందిస్తాయి. మీరు మధ్యాహ్నం భోజనం చేసే వరకు మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.
అయితే ఉదయం తినకూడని ఫుడ్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి.
Health Tips: ఉదయం ఇవి తింటున్నారా? గుండె జబ్బులు.. డయాబెటిస్ తప్పదు!
ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతే కాదు టిఫిన్‌కి బదులుగా స్మూతీస్ తాగడం, వైట్ బ్రెడ్ తినడం కరెక్ట్ కాదంటున్నారు. బ్రెక్‌ఫాస్ట్‌కి బదులుగా తృణధాన్యాలు తినడం కూడా మంచిది కాదని.. ఇది ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

Translate this News:











