Indian Defence : భారత వైమానిక దళం (Indian Air Force)సామర్థ్యాన్ని పెంపొందించడానికి రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన జరిగిన సమావేశంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.7,800 కోట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. భారత వైమానిక దళాన్ని (Indian Air Force) మరింత బలోపేతం చేయడానికి Mi-17 V5 హెలికాప్టర్లలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (EW) సూట్‌ను కొనుగోలు చేయడం.. ఇన్స్టాల్ చేయడం కోసం AoN అవార్డు పొందింది. ఈ EW సూట్‌ను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పూర్తిగా చదవండి..Indian Defence : ఇక తగ్గేదేలే…ఎవడొస్తారో రండిరా.. ఇండియన్ ఆర్మీ అదుర్స్..!!
రక్షణశాఖను మరింత పటిష్టం చేసేందుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.7,800 కోట్ల విలువైన మూలధన సేకరణ ప్రతిపాదనల కోసం డిఎసి అప్రూవల్ ఆఫ్ రిక్వైర్మెంట్ (ఎఒఎన్)ను ఆమోదించింది. ఈ ప్రాతిపదనతో అన్ని రక్షణశాఖ కొనుగోళ్లు, స్వదేశీ వనరుల నుంచే జరుగుతాయని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Translate this News:











