ఇటీవల అమెరికాలో 158 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన మరువకముందే మరో ఘోర ప్రమాదం ఈజిప్టులో జరిగింది. ఆ దేశ రాజధాని కైరో నుంచి అలెంగ్జాండ్రియా నగరాన్ని కలిపే హైవేపై పలు కార్లు, బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 32 మంది మృతి చెందారు. మరో 63 మంది గాయాలపాలయ్యారు. ఈ మేరకు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముందుగా హైవేపై కైరో వెళ్తున్న ఓ ప్యాసెంజర్ బస్సు ఒక దగ్గర పార్క్ చేసిన కార్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత మరికొన్ని కార్లు, మరో రెండు ఆ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఓ కారు నుంచి ఆయిల్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
పూర్తిగా చదవండి..Accident: ఘోర ప్రమాదం.. కార్లు, బస్సులు ఢీ.. 32 మంది మృతి
ఈజిప్టులోని కైరోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కార్లు,బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 32 మంది మృతి చెందారు. మరో 63 మంది క్షతగాత్రులయ్యారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

Translate this News:











