Israel-Hamas War: పశ్చిమాసియా అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఆ రెండు ప్రాంతాలే కాక లెబనాన్, ఇరాన్ (Iran) లలో కూడా యద్ధవాతావరణం నెలకొంది. గాజా (Gaza) సరిహద్దుల్లో బలగాలను మొహరించి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. 3,60,00మంది ఇజ్రాయెల్ రిజర్విస్ట్లు గాజాలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు గాజా నంచి హమాస్ రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గాజాలో భూదాడులకు దిగితే తాము యుద్ధంలోకి వస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. గాజాలో ప్రజలంతా ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇంకా వెళ్ళాల్సిన వారు చాలా మందే ఉన్నారు. గాజాలో ఇప్పటికే చాలా హమాస్ స్థావరాను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. దాంతో మిలిటెంట్ కమాండర్లను హతమార్చామని అంటోంది. ఏమైనా, ఎంత మంది చనిపోయినా తాము మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అంటోంది హమాస్.
పూర్తిగా చదవండి..Israel-Hamas War: సరిహద్దులో ఇజ్రాయెల్ సేనలు-గాజాలో ఉద్రిక్త వాతావరణం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం పదోరోజుకు చేరుకుంది. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న గాజా పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరి మీద ఒకరు విమానాలు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నారు. దీనికి తోడు 3 లక్షలకు పైగా సైన్యంతో గాజాను చుట్టుముట్టడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.

Translate this News:











