హెచ్ఐవీ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధికి గురైనవారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది. సాధారణంగా లైంగిక సంబంధం వల్ల వచ్చే ఈ వ్యాధి.. ఈ మధ్యకాలంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల రక్తమార్పిడి చేసే విషయంలో కూడా పలువురు హెచ్ఐవీకి గురైన ఘటనలు ఉన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. రక్తమార్పిడి చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో.. 14 మంది చిన్నారుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. కలుషిత రక్తం ఎక్కించడం వల్ల.. ఆ చిన్నారులకు హెచ్ఐవీ, హెపటైటిస్ బి, సీ సోకినట్లు తేలింది.
పూర్తిగా చదవండి..వైద్యుల నిర్లక్ష్యం.. 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ, హెపటైటీస్ వ్యాధులు..
ఉత్తరప్రదేశ్లోని లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ, హెపటైటీస్ బీ, సీ వ్యాధులు సోకడం కలకలం రేపింది. వాస్తవానికి ఆ 14 మంది చిన్నారులు తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్లకి ఎప్పటికప్పుడు రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయించుకున్న సమయాల్లోనే ఆ చిన్నారులకు ఈ వ్యాధులు సోకినట్లు తేలింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది.

Translate this News:











