హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూకు వేలంలో రికార్డ్ ధర పలికింది. గణేశుడి లడ్డూను ఏకంగా కోటి 26 లక్షలకు పాడుకున్నారు. వేలంలో వచ్చిన మొత్తాన్ని ఛారిటీకే ఉపయోగిస్తానని చెబుతున్నారు లడ్డూను దక్కించుకున్న ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. గణపతి లడ్డూ ఇంత ధర పలకడం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. ఇక మాదాపూర్ మై హోమ్ భూజాలో కూడా గణపతి లడ్డూకు వేలంలో భారీ ధరనే సొంతం చేసుకుంది. ఇక్కడ లడ్డూ 25.50 లక్షలకు సొంతం చేసుకున్నారు అపార్ట్ మెంట్ వాసులు. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వినాయకుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. మరోవైపు బాలాపూర్ లో గణేష్ లడ్డూ ఆక్షన్ ఇంకా నడుస్తోంది.
పూర్తిగా చదవండి..Ganesh Laddu Auction: హైదరాబాద్ లో రికార్డ్ ధర పలికిన గణేష్ లడ్డూ.. రూ.1.20 కోట్లు.. ఎక్కడంటే?
హైదరాబాద్ లో గణేష్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాల్లో గణేష్ లడ్డూకు కోట్ల ధర పలికింది. ఒక్క లడ్డూను 1.20 కోట్లకు దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడే వేలం పాటలో లడ్డూ 60.80 లక్షలు పలికింది.

Translate this News:












